![]() |
![]() |

అగ్నిపరీక్ష పేరుతో ప్రతీ సంవత్సరం ఉండే బిగ్ బాస్ సందడిని పదిహేను రోజుల ముందే తీసుకొచ్చారు. ప్రతి సీజన్‌లోనూ కంటెస్టెంట్స్‌ని గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో అనౌన్స్ చేసి హౌస్‌లోకి పంపుతారు. తొలివారంలో ఓటింగ్ స్టార్ట్ అయ్యేది. కానీ ఈసారి అగ్నిపరీక్ష పేరుతో హౌస్‌లోకి పంపించబోయే సగం మంది కంటెస్టెంట్స్ ని ముందే రెడీ చేసారు. వాళ్లకి ఓటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా పదమూడు మందిని ఫైనలిస్ట్‌లను సిద్దం చేసి.. వారిలో టాప్-5 కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపించబోతున్నారు.
అగ్నిపరీక్ష నుండి అయిదుగురు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించడం కోసం బిబి టీమ్ భిన్నమైన టాస్క్ లు ఇచ్చింది. ఈ అగ్ని పరీక్ష మొత్తంగా పదిహేను ఎపిసోడ్‌లు సాగింది. దీనికి యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా చేయగా అభిజీత్, నవదీప్, బిందుమాధవిలు జడ్జులుగా ఉన్నారు. ఈ అగ్నిపరీక్ష ముగింపుకి చేరుకోగా.. తెగింపు చూపించిన కంటెస్టెంట్స్ పదమూడు మంది మాత్రమే మిగిలారు. వీరిలో నుండి అయిదుగురు మాత్రమే కన్ఫమ్ కంటెస్టెంట్స్ గా నిలిచారు. మాస్క్ మెన్ హరీష్ అలియాస్ హరిత హరీష్, దమ్ము శ్రీజ, ఆర్మీ పవన్ కళ్యాణ్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి అలియాస్ దివ్య నిఖిత హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ లలో కన్ఫమ్ అయ్యారు. వీళ్ళు సామాన్యుల (కామన్ మ్యాన్) కేటగిరీలో హౌస్ లోకి వెళ్ళారు.
తనుజ, భరణి, ఆషా సైనీ, సుమన్ శెట్టి, సంజనా గల్రానీ, రాము రాథోడ్, స్రష్టి వర్మ, రీతు చౌదరి.. సెలబ్రిటీ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే హౌస్ లోకి ఫస్ట్ టూ వీక్స్ ఉండటానికి ఇద్దరు ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన కంటెస్టెంట్స్ కి, సెలెబ్రిటీ కేటగిరీలో వచ్చిన కంటెస్టెంట్స్ కు సపరేట్ రూమ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే బిగ్ బాస్ సీజన్-9 టీవీ అభిమానులకి సూపర్ ఫీస్ట్ అవుతుంది.
![]() |
![]() |